Kanguva Trailer: ‘కంగువా’ ట్రైలర్.. విజువల్స్ అద్భుతం.. కానీ..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Siva) , స్టార్ డైరెక్టర్ శివ (Siva) ..ల కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘కంగువా’ (Kanguva) . ‘స్టూడియో గ్రీన్’ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలపై కె.ఈ.జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) , వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి..లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే గ్లింప్స్ , ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి.

Kanguva Trailer

అలాగే అక్టోబర్ 10 న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా.. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 37 సెకన్ల నిడివి కలిగి ఉంది. స్టోరీని అయితే ఇందులో రివీల్ చేయలేదు. రెండు తెగల మధ్య జరిగే పోరుని.. ఇందులో చూపించినట్టు స్పష్టమవుతుంది.

ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు.. విజువల్స్ అదిరిపోయాయి. కొన్ని విజువల్స్ లో అయితే వయొలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. దర్శకుడు శివ సినిమాలు టెక్నికల్ గా డిజప్పాయింట్ చెయ్యవు. ‘కంగువా’ కూడా అదే స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది. అయితే ట్రైలర్లో డబ్బింగ్ తేడా కొట్టింది. తెలుగులో చూస్తే అది లోపంగా కనిపిస్తుంది. అది తప్పిస్తే… ట్రైలర్ విజువల్ గా మంచి ఫీల్ ను కలిగిస్తుంది.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus