నాగచైతన్య (Naga Chaitanya) శోభిత (Sobhita Dhulipala) నిశ్చితార్థ వేడుక ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత అకస్మాత్తుగా నిశ్చితార్థం గురించి ప్రకటించి అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. నాగార్జున (Nagarjuna) ఈ నిశ్చితార్థం గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఒక ఆంగ్ల వెబ్ సైట్ తో మాట్లాడుతూ నాగార్జున ఈ కామెంట్లు చేశారు. చైతన్య శోభిత నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని నాగ్ అన్నారు.
విడాకుల తర్వాత చైతన్య ఎంతో బాధ పడ్డాడని నాగ్ కామెంట్లు చేశారు. చైతన్య ఆ బాధను ఎవరితో పంచుకోలేదని ఆయన అన్నారు. నా కొడుకు తిరిగి సంతోషంగా ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున కామెంట్లు చేశారు. చైతన్య శోభిత పెళ్లికి కొంత సమయం తీసుకుంటామని నాగ్ తెలిపారు. మరో రెండు లేదా మూడు నెలల తర్వాత చైతన్య శోభిత పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.
శోభిత విషయానికి వస్తే ఆమె 2013 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచారు. తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో పెరిగారు. 2016 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించిన శోభితా ఆ ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకున్నారు. చైతన్య కెరీర్ విషయానికి వస్తే లవ్ స్టోరీ (Love Story) , బంగార్రాజు (Bangarraju) సినిమాల తర్వాత చైతన్య నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.
అయితే దూత (Dhootha) వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న చైతన్య తండేల్ తో (Thandel) మరో సక్సెస్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకుడు కాగా చైతన్య, చందూ మొండేటి కాంబోలో ఈ సినిమా మూడో సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ కాంబోలో తెరకెక్కిన ప్రేమమ్ (Premam) హిట్ గా నిలవగా సవ్యసాచి ఫ్లాప్ అయింది.