Hero Ram: ఓపెనింగ్‌ ఉండని రామ్‌ సినిమాలో హీరోయిన్‌గా కుర్ర సంచనలం!

‘స్కంద’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్‌… త్వరలో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అంటూ ఇప్పటికే ఈ సినిమాను టీమ్‌ అనౌన్స్‌ చేసేసింది కూడా. అయితే ఈ సినిమాతోపాటు మరో సినిమా కూడా పారలల్‌గా చేయాలని అనుకుంటున్నాడట. త్వరలోనే ఈ విషయంలో హాఫ్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేంటీ హాఫ్‌ క్లారిటీ అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ సినిమాకు ఓపెనింగ్‌ కార్యక్రమం ఉండే అవకాశం లేదు కాబట్టి.

కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం అందరికీ తెలియకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా నిర్మిస్తోన్న ఏకైక సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అనే విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యానర్‌లోనే రామ్‌ ఓ సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే సినిమా మొదలవుతుంది అని సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఓ కొత్త హీరోయిన్‌ను వెతుకుతున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ చూపులు కన్నడ సీమవైపు వెళ్లాయి అంటున్నారు.

ఎనర్జిటిక్‌ హీరో (Hero Ram) పక్కన, ఎమోషనల్‌ హీరోయిన్‌ను సెలక్ట్‌ చేయాలని టీమ్‌ అనుకుంటోందట. ‘సప్తసాగరాలు దాటి’ అంటూ ఇటీవల పార్ట్‌ ఏతో వచ్చిన భామ రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర నటనకు ప్రాధాన్యమున్నదని, అందుకే ఆమెను ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. రుక్మిణి వసంత్‌తో ఇప్పటికే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చర్చలు జరుపుతోందట. ఈ చర్చలు దాదాపు సక్సెస్ అయినట్లే అని అంటున్నారు.

రక్షిత్‌శెట్టి హీరోగా రుక్మిణి వసంత్‌, చైత్ర జె ఆచార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సప్తసాగరాలు దాటి’ సైడ్‌ బి ఈ నెల 17న విడుదల కానుంది. పీపుల్ మీడియా బ్యానరే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఆ క్రమంలోనే రుక్మిణి వసంత్‌ నటనను చూసి నిర్మాతలు తర్వాతి సినిమాను ఆమెనే తీసుకోవాలని అనుకున్నారట. చూద్దాం సినిమా మొదలైందనే పుకారు వచ్చినప్పుడు ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. పుకారు అని ఎందుకన్నామో మీకు తెలిసే ఉంటుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus