ఈ శుక్ర, శనివారాల్లో మొత్తం తొమ్మిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ అందులో ఇంట్రెస్టింగ్ సినిమా అంటే అందరి కళ్లు ‘కాంతారా’ మీదనే ఉన్నాయి. మిగిలిన సినిమాలన్నీ మౌత్ టాక్, రివ్యూలపై ఆధారపడాల్సిందే. కన్నడలో సంచలన విజయం నమోదు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ అయింది. ఇందులో భారీ క్యాస్టింగ్ కూడా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయినప్పటికీ జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది.
ఏకంగా వంద కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లింది. ఇందులో నేటివిటీ మన తెలుగు ఆడియన్స్ కి ఏ మేరకు కనెక్ట్ అవుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. శాండల్ వుడ్ లో హిట్ అయిన రేంజ్ లో మన దగ్గర కూడా హిట్ అవుతుందని చెప్పలేం. కానీ కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ‘కాంతారా’లో నేటివిటీ, సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ పురాతన కాలం నుంచి కన్నడిగులకు సంబంధించినవి.
ఈ ఎలిమెంట్స్ మన మాస్ ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతాయో చూడాలి. కర్ణాటకలో మాత్రం ఈ సినిమా హవా మాములుగా లేదు. ఈ సినిమా కారణంగానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ కన్నడలో పెద్దగా ఆడలేదు. మొదటిసారి అక్కడ చిరంజీవి సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదనేది అక్కడి రిపోర్ట్. ఒకవేళ ‘కాంతారా’ గనుక లేకపోయి ఉంటే మెగాస్టార్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది.
మరి కన్నడ రేంజ్ లో ఇక్కడ కూడా ‘కాంతారా’ వర్కవుట్ అవుతుందేమో చూడాలి. కానీ ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేస్తున్నట్లు లేరు. కన్నడలో కూడా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో చేయలేదు. అయినా సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో మాత్రం ప్రమోషన్స్ చేయాల్సిందే. లేదంటే సినిమా జనాలకు రీచ్ అవ్వడం కష్టమే.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!