మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) సినిమా జూన్ 27న రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యి 6 రోజులు కావస్తున్నా.. కలెక్షన్స్ పర్వాలేదు అనిపిస్తున్నాయి. కానీ రూ.200 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమా స్థాయికి తగ్గ కలెక్షన్స్ కాదు అనే రిమార్క్ కూడా ట్రేడ్ సర్కిల్స్ నుండి ఎక్కువగా వినిపిస్తుంది. మొదటిరోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.మంచు విష్ణు కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. వీకెండ్ వరకు బాగానే కలెక్ట్ చేసింది. తర్వాత కొంచెం తగ్గాయి.
ఇప్పటికీ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ అద్భుతాలు జరగడం లేదు. ‘కన్నప్ప’ (Kannappa) 6 డేస్ కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం | 6.44 cr |
సీడెడ్ | 2.18 cr |
ఉత్తరాంధ్ర | 2.06 cr |
ఈస్ట్ | 1.13 cr |
వెస్ట్ | 0.81 cr |
గుంటూరు | 0.88 cr |
కృష్ణా | 0.78 cr |
నెల్లూరు | 0.72 cr |
ఏపీ+తెలంగాణ | 15 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.25 cr |
ఓవర్సీస్ | 2.42 cr |
వరల్డ్ టోటల్ | 21.67 cr (షేర్) |
‘కన్నప్ప’ (Kannappa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.87 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.21.67 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.39.5 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.65.33 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంత టార్గెట్ రీచ్ అవ్వడం అయితే ప్రస్తుతానికి కష్టంగానే కనిపిస్తుంది. కానీ ఉన్నంతలో బాగానే కలెక్ట్ చేస్తుంది.