ఫిష్ వెంకట్ (Fish Venkat) అందరికీ సుపరిచితమే. ‘ఆది’ సినిమాలో ‘ఒక్కసారి తొడగొట్టు చిన్నా’ అనే ఒక్క డైలాగ్ తో ఇతను పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఇతనిలోని కామెడీ యాంగిల్ ను కూడా ‘కృష్ణ’ ‘అదుర్స్’ ‘నాయక్’ వంటి సినిమాల్లో బాగా వాడుకున్నాడు దర్శకుడు వినాయక్. ఇంకో రకంగా చెప్పాలంటే ఫిష్ వెంకట్ ని పాపులర్ చేసిందే వి.వి.వినాయక్.
కొన్నాళ్ళు బిజీ కమెడియన్ గా రాణించిన అతను ఇప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో, చేతిలో రూపాయి లేక వెంటిలేటర్ పై పడి ఉన్నాడు. ఫిష్ వెంకట్ (Fish Venkat) ఆరోగ్యం కొన్ని నెలల నుండి అస్సలు బాగోవడం లేదు. 9 నెలల క్రితం ఫిష్ వెంకట్ ఆరోగ్యం పూర్తిగా పాడైందని తెలుస్తుంది. మొన్నామధ్య ఫిష్ వెంకట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.
తర్వాత నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి చదలవాడ కూడా ఆర్థిక సాయం చేశారు. 2 కిడ్నీలు పూర్తిగా పాడవడం, బీపీ షుగర్ సమస్యలు కూడా ఉండటం వల్ల ఫిష్ వెంకట్ (Fish Venkat) మంచానికే పరిమితమయ్యారు. తాజాగా ఓ యాంకర్.. ఫిష్ వెంకట్ (Fish Venkat) చికిత్స ఉన్న హాస్పిటల్ కి వెళ్లగా.. అక్కడ ఫిష్ వెంకట్ వెంటిలేటర్ పై మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతనికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఆ వీడియో ద్వారా ఫిష్ వెంకట్ కూతురు కోరడం జరిగింది. అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి చూసి అందరికీ ఓ డౌట్ రావాలి.
‘ఇలాంటి వాళ్ళని ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఆదుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు?’ అని. అందుకు వినిపిస్తున్న సమాధానం ఫిష్ వెంకట్ లైఫ్ టైం మెంబర్ కాదట. వందకు పైగా సినిమాల్లో నటించినప్పటికీ ఇతను ఎందుకు లైఫ్ టైం మెంబర్ కాలేదు? అనే ప్రశ్నకి సమాధానాలు తెలియాల్సి ఉంది.