‘పుష్ప’ సినిమాలు అనౌన్స్ చేసే సమయంలో అల్లు అర్జున్ తన ఎక్స్ (అప్పట్లో ట్విటర్) ఖాతాలో చేసిన పోస్ట్ (అప్పట్లో ట్వీట్)లో కొన్ని అక్షరాలు రాసుకొచ్చాడు. అప్పుడు అవేంటనేది ఎవరికీ అర్థం కాలేదు. ఏదో సరదాగా రాశాడులే అనుకున్నారంతా. కానీ సినిమా పేరు ‘పుష్ప’ అని పెట్టాక అప్పుడు ట్వీట్‌లో రాసింది ఇదే కదా అని హవ్వ అనుకున్నారంతా. బన్నీ టాలెంట్ సూపర్ అంటూ పొగిడేశారు అంతా. ఇప్పుడు ‘రాకా’ విషయంలోనూ అదే జరిగింది అని అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
‘రాకా’ సినిమా ఫస్ట్ లుక్‌లో బన్నీ పోజును ఇప్పటికే తన ఫ్యాన్స్‌కి షేర్ చేశాడు అనేది ఆ వైరల్ పోస్ట్ సారాంశం. అంటే ముఖం మీద చెయ్యి పెట్టి కన్ను మాత్రం పూర్తిగా కనిపించేలా ఓ సీరియస్ లుక్ ఇవ్వడం గతంలోనే చేశాడు అనేది ఆ వాదనల సారాంశం. ప్రస్తుతం బన్నీ సోషల్ మీడియా ఖాతాల్లో డిస్‌ప్లే పిక్చర్‌గా అదే ఉంది. దీంతో ఆ డీపీ, ‘రాకా’ లుక్ పక్కపక్కన పెట్టి తెగ షేర్ చేస్తున్నారు. ఈ లెక్కన బన్నీ ‘రాకా’ ఫస్ట్ లుక్ కాన్సెప్ట్‌ను ఎప్పుడో షేర్ చేసేశాడు అని అనేస్తున్నారు.
నిజానికి బన్నీ ఈ పోజుతో డీపీ పెట్టి రెండేళ్లు అయిపోయింది. ‘రాకా’ సినిమా గతేడాది ఏప్రిల్ 8న అనౌన్స్ అయింది. అంటే ఆ డీపీకి, ఈ పోజుకు ఏ మాత్రం సంబంధం లేదు. అయితే బన్నీకి ఈ పోజు అంటే బాగా ఇష్టమని డీపీ పెట్టుకున్నాడుగా అర్థమవుతోంది. అందుకే అట్లీ కూడా ఆ ఫేవరెట్ పోజునే తన సినిమా ఫస్ట్ లుక్‌గా సిద్ధం చేసి ఉండొచ్చు అనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా చెప్పాలి. పుకార్ల బట్టి చూద్దాం అంటే.. ఈ సినిమా ఎప్పుడు రావొచ్చు అనే రూమర్ ఇప్పటివరకు ఒకటి కూడా రాలేదు.