రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్ర పోషించి దర్శకత్వం కూడా వహించిన ‘కాంతార’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడలోనే కాకుండా తెలుగు,హిందీ భాషల్లో కూడా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ వసూళ్లు సాధించింది. దీంతో ‘కాంతార’ ప్రీక్వెల్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే అన్ని ఏరియాల్లో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక మొదటి రోజు ఈ సినిమాకి కొన్ని కంప్లైంట్స్ తో కూడిన పాజిటివ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ దసరా, అలాగే గాంధీ జయంతి హాలిడే వల్ల తొలిరోజు భారీ ఓపెనింగ్స్ పొందింది.వీకెండ్ వరకు సినిమా అదే జోరు చూపించింది. ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 16.2 cr |
సీడెడ్ | 5.82 cr |
ఉత్తరాంధ్ర | 4.91 cr |
ఈస్ట్ | 2.10 cr |
వెస్ట్ | 1.48 cr |
గుంటూరు | 2.57 cr |
కృష్ణా | 2.70 cr |
నెల్లూరు | 1.14 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 36.92 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.56 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 37.48 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్) |
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.37.48 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.55 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.48.52 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసింది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేయడం వల్ల.. టార్గెట్ సగంపైనే ఉంది. వీక్ డేస్ లో కూడా గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు.