కన్నడలో ఇటీవల రిలీజ్ అయిన ‘కాంతారా’ చిత్రం నిన్న అంటే అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు రేటింగ్ లు ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి కుమ్మేసింది.
దీంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 4వ రోజు అదీ వీక్ డేస్ లో కూడా కోటి పైనే షేర్ ను కలెక్ట్ చేసి అందరికీ షాకిచ్చింది.ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.57 cr |
సీడెడ్ | 1.07 cr |
ఉత్తరాంధ్ర | 1.05 cr |
ఈస్ట్ | 0.70 cr |
వెస్ట్ | 0.42 cr |
గుంటూరు | 0.52 cr |
కృష్ణా | 0.46 cr |
నెల్లూరు | 0.32 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.11 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.13 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 8.24 cr (షేర్) |
‘కాంతారా’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 4 రోజులు పూర్తయ్యేసరికి రూ.8.24 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.6.24 కోట్ల భారీ లాభాలను అందించింది.
నిన్న కూడా ఈ మూవీ రూ.1.4 కోట్ల పైనే షేర్ ను అందించింది. ఈ మూవీ దూకుడు ముందు దీపావళికి రిలీజ్ అయ్యే సినిమాలు కూడా నిలబడతాయన్న గ్యారెంటీ కనబడడం లేదు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!