Rishab Shetty: కాంతారా మూవీ హీరో రిషబ్ శెట్టి ప్రేమ కహానీ..!

కన్నడ సినిమాలు తెలుగులో ఆడడమే గ్రేట్ అనుకుంటే… ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేసే స్థాయికి ఎదిగాయి. బాహుబలి, కే.జి.ఎఫ్, పుష్ప వంటి సినిమాలు అన్ని బౌండరీలను చెరిపేసాయి. తాజాగా రిలీజ్ అయిన కన్నడ సినిమా కాంతారా కూడా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. టాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా ఈ మూవీ షేక్ చేస్తుంది.ఈ చిత్రం హీరో అయిన రిషబ్ శెట్టి నిన్న మొన్నటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలీని వ్యక్తి. తాప్సి ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాసిబల్ …

అనే సినిమాలో ఇతను చిన్న అతిథి పాత్రలో నటించినట్టు కూడా చాలా మందికి తెలీదు. కాంతారా లో అతను అద్భుతంగా నటించడమే కాదు, ఆ సినిమాకి దర్శకుడు కూడా అతనే..! దీంతో యూట్యూబ్ లో అతని గురించి జనాలు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అతని లవ్ స్టోరీ అందరినీ ఆకట్టుకుంటుంది. రిషబ్ శెట్టి భార్య పేరు ప్రగతి శెట్టి.వీరిది లవ్ మ్యారేజ్. 2016 వ సంవత్సరంలో కిరిక్ పార్టీ సినిమా ఈవెంట్ లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.

రిషబ్ శెట్టి దర్శకత్వంలో కిరిక్ పార్టీ అనే చిత్రం రూపొందింది. ఇందులో రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరో. ఇతనికి ప్రగతి శెట్టి పెద్ద ఫ్యాన్.అందుకే కిరిక్ పార్టీ సినిమా ఈవెంట్ కు వెళ్ళింది. అక్కడ రిషబ్ శెట్టి ఆమెను చూసాడు. అయితే ఆమెను ఎక్కడో చూసాను అని సినిమా స్టయిల్లో అనుకున్నాడట రిషబ్. అప్పుడు ఇంటికి వెళ్లి ఫేస్ బుక్ ఓపెన్ చెయ్యగా ప్రగతి శెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ అతనికి కనిపించింది. అప్పటికే ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఏడాది దాటిందట.

దీంతో వెంటనే ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశాడు రిషబ్.అప్పటి నుండి వీరి మధ్య ఛాటింగ్ మొదలైంది. అలా స్నేహం, ప్రేమ, పెళ్ళి వరకు వెళ్ళింది విషయం. మొదట వీరి పెళ్లికి ప్రగతి పేరెంట్స్ ఒప్పుకోలేదు. రిషబ్ సినిమా ఫీల్డ్ లో పనిచేయడం వల్ల వాళ్ళు ఒప్పుకోలేదు.ప్రగతి ఐటీ ఎంప్లాయ్. అయితే మొత్తానికి వీరి పెద్దలను ఒప్పించి 2020 లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక ప్రగతి ఐటీ జాబ్ మానేసింది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ జంట హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus