సుమంత్ కు ‘కపటదారి’ కూడా వర్కౌట్ కాలేదు.. తప్పెక్కడ జరిగిందబ్బా..!

  • February 23, 2021 / 06:05 PM IST

డిసెంబర్ ఎండింగ్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో థియేటర్లు తెరుచుకున్నాయి. అసలే థియేటర్ మొహం చూసి చాలా రోజులైపోయింది అనే ఫీలింగ్లో ఉన్న ప్రేక్షకులు అప్పటి నుండీ ఏ సినిమా విడుదలైన థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. చిన్న సినిమా అని లేదు పెద్ద సినిమా అని లేదు. హిట్టని లేదు.. ప్లాప్ అని లేదు. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఒక్క ‘క్రాక్’ కు తప్ప మరే సినిమాకి పాజిటివ్ టాక్ రాలేదు. అయినప్పటికీ అన్ని సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి. ‘అల్లుడు అదుర్స్’ వంటి రొటీన్ రొట్ట సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ ను సాధించి యావరేజ్ రిజల్ట్ ను సాధించింది.

ఇక అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ దాని ఫుల్ రన్ షేర్ కోటికి తగ్గలేదు. ఇక ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ మూవీ అనిపించుకుంది. ఇక ‘జాంబీ రెడ్డి’ ‘ఉప్పెన’ ‘నాంది’ వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ‘చక్ర’ ‘పొగరు’ వంటి డబ్బింగ్ సినిమాలు అలాగే ‘జి జాంబీ’ వంటి ఊరు పేరు తెలియని మూవీ కూడా హిట్ అయ్యింది. ‘జి జాంబీ’ అనే చిత్రం గురించి ఎక్కడా సౌండ్ కూడా లేకపోయినా ఆ చిత్రం కూడా రూ.45లక్షల షేర్ ని వసూల్ చేసి హిట్ గా నిలిచింది.

అయితే ఫిబ్రవరి 19న విడుదలైన సుమంత్ ‘కపటదారి’ పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కనీసం రూ.40లక్షల షేర్ ను ఇంకా వసూల్ చెయ్యలేదు. ఆ చిత్రం హిట్ అవ్వాలంటే 1.8కోట్ల షేర్ ను వసూల్ చెయ్యాలి. అది ఎలాగు అసాధ్యమని తేలిపోయింది. అంతలా ప్రమోట్ చేసిన ఆ చిత్రం కనీసం రూ.1 కోటి కూడా వసూల్ చేయకపోవడంతో సుమంత్ పనైపోయినట్టే అనే కామెంట్లు నమోదవుతున్నాయి. దానికి కారణాలు ఏంటి అన్నది ట్రేడ్ పండితులు కూడా చెప్పలేకపోతుండడం గమనార్హం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus