‘క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్’ బ్యానర్ పై జి.ధనంజయన్, లలిత ధనంజయన్ ల నిర్మాణంలో ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘కపటదారి’. సుమంత్,నందిత శ్వేతా జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగానే ఉండడంతో ఈ సినిమా పై అందరి ఫోకస్ పడింది. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కవలుదారి’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటిరోజు పాజిటివ్ టాకే వచ్చింది. అయినప్పటికీ సుమంత్ బ్యాడ్ ఫామ్ కారణంగా కలెక్షన్లు ఏమాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.
ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.09 cr |
సీడెడ్ | 0.04 cr |
ఉత్తరాంధ్ర | 0.05 cr |
ఈస్ట్ | 0.04 cr |
వెస్ట్ | 0.03 cr |
గుంటూరు | 0.05 cr |
కృష్ణా | 0.03 cr |
నెల్లూరు | 0.02 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.35 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.02 cr |
ఓవర్సీస్ | 0.04 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.41 cr |
‘కపటదారి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.1.9కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకూ ఈ చిత్రాన్ని నిర్మాతలు ఒన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలబడాలంటే.. రూ.2.2కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్లో ఈ చిత్రం కేవలం 0.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.1.5కోట్ల వరకూ నష్టాలను మిగిల్చింది.
Click Here To Read Movie Review
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!