`క‌ప‌ట‌ధారి` చిత్రంలో మ‌రో డిఫ‌రెంట్ పాత్ర‌తో మెప్పించ‌నున్న హీరో సుమంత్‌

హీరో సుమంత్‌.. యాక్షన్‌, రొమాంటిక్‌, కామెడీ పాత్రల్లో ఒదిగిపోతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు. ఈ ఫిబ్రవరి 19న విడుదల కానున్న ‘కపటధారి’సినిమాతో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంతో హీరో సుమంత్‌లోని మరో కోణాన్ని రెక్టర్‌ ప్రదీప్‌ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ‘కపటధారి’ చిత్రంలో ఇప్పటి వరకు చేయనటువంటి ఓ డిఫరెంట్‌ రోల్‌ సుమంత్‌ మెప్పించనున్నారు.

నందితా శ్వేత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం.. కన్నడ మూవీ ‘కావలుధారి’కి రీమేక్‌. కన్నడలో సూపర్‌హిట్‌ అయిన ఈ చిత్రం ‘క‌ప‌ట‌ధారి’గా తమిళంలో రీమేక్‌ అయ్యింది. తమిళంలో గత నెలలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. నాజర్‌, సంపత్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా సమంత అక్కినేని విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్ వచ్చింది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus