Karan Johar, KGF2: కేజీఎఫ్2 పై షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్ జోహార్!

Advertisement

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్2 ఏ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉండగా ఇప్పటికీ ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కేజీఎఫ్2 సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. యశ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది.

అయితే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తాజాగా కేజీఎఫ్2 సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ మూవీ డైరెక్టర్లకు కథలను ఎంచుకోవడం, కథలను తెరకెక్కించడంలో ఉన్న నమ్మకం బాలీవుడ్ లో లోపించిందని తెలుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఒకే మూవీలో ఎన్నో అంశాలను చూపించాలని అనుకొని ఫెయిల్ అవుతుంటామని ఆయన వెల్లడించారు. సౌత్ డైరెక్టర్లు మాత్రం ఏం చెప్పాలని అనుకుంటున్నారో దాన్ని ప్రేక్షకుడికి చేరువయ్యే విధంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ మధ్య కాలంలో నేను కేజీఎఫ్2 సినిమాను చూశానని మనస్పూర్తిగా ఆ సినిమా నాకెంతో నచ్చిందని ఆయన కామెంట్లు చేశారు. ఆ సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కించి ఉంటే మాకెన్నో విమర్శలు ఎదురయ్యేవని కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు. కేజీఎఫ్2 సినిమాపై విమర్శలు చేసి మమ్మల్ని చంపేసేవాళ్లు అని కరణ్ జోహార్ కామెంట్లు చేశారు. కేజీఎఫ్2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

కన్నడ ఇండస్ట్రీలో గతంలో ఏ సినిమా సాధించని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. కేజీఎఫ్2 సినిమా తర్వాత యశ్ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. యశ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus