Kareena Kapoor: నా పొట్టలో ఉన్నది పాస్తా వైన్ మాత్రమే.. కంగారు పడకండి!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ గా కొనసాగుతున్నటువంటి సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉండి అనంతరం 2012 వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే కరీనా కపూర్ కన్నా ముందే సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అయినా తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా సైఫ్ అలీ ఖాన్ విడాకులు తీసుకోవడంతో ఈయన కరీనాకపూర్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్‌ అలీ ఖాన్ (జేహ్‌) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పిల్లలు కాస్త పెద్ద కావడంతో ఈమె వరస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా కరీనాకపూర్ ప్రస్తుతం తన భర్త పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

ఇక ఈ ఫోటోలను చూసిన ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోలలో కరీనాకపూర్ పొట్ట కాస్త పెద్దగా ఉండడంతో ఈమె మూడోసారి తల్లి కాబోతుందనే వార్తలు సృష్టించారు. ఇక ఈ వార్తలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.ఇలా తన మూడో ప్రెగ్నెన్సీ గురించి వార్తలు పెద్ద ఎత్తున రావడంతో కరీనాకపూర్ స్పందించి ఈ వార్తలకు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

నా పొట్టలో ఉన్నది కేవలం పాస్తా వైన్ మాత్రమే నేను గర్భవతిని కాదు ఎవరు కంగారు పడకండి అంటూ అసలు విషయం చెప్పేసారు. ఇకపోతే మన దేశ జనాభా పెరగడం కోసం తాను చాలా చేశానని సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చినట్లు కరీనాకపూర్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ విధంగా కరీనాకపూర్ ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందిస్తూ తాను ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పులి స్టాప్ పడింది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus