హ్యాండ్ బాగ్ కు అంత బిల్డప్ అవసరమా?

సినీ సెలబ్రిటీలు ఏం చేసినా.. ఎటువంటి దుస్తులు ధరించినా మనకి చాలా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. అయితే వాళ్ళ మైంటెనెన్సు అలాగే ఉంటుంది అని చాలా మంది అర్థం చేసుకునే ప్రేక్షకులు కూడా ఉన్నారు. సరే ఈ విషయాల్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ ఇచ్చే బిల్డప్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఏ విషయంలో వారు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరోయిన్? అంటే .. బాలీవుడ్ అందాల భామ కరీనా..!

తాజాగా తన కొడుకు పుట్టినరోజు వేడుకని నిర్వహించిన ఈ బ్యూటీ.. ఆ వేడుక మొత్తం ఓ బ్యాగ్ వేసుకుని తిరిగిందట. ఆ బ్యాగ్ ధర ఎంత అని అడగగా 3.90 లక్షలు అని చెప్పిందట. ఆ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరూ.. ఆ బ్యాగ్ గురించి ఎదిగేలా షో చేస్తూనే ఉందట. ‘సినీ సెలబ్రిటీలు అందరూ కాస్ట్లీ బ్రాండ్ కలిగిన వాటినే వాడతారు. కానీ ఒక్క బ్యాగ్ కే 3.90 లక్షలు పెట్టి ప్రతీ ఒక్కరి దగ్గరకు వెళ్ళి ఇంత బిల్డప్ ఇవ్వాలా’ అంటూ కరీనా పై కొందరు సెటైర్లు వేస్తున్నారు.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus