ఈమధ్య మన భారతీయ నటీమణులందరూ హాలీవుడ్ రంగప్రవేశం చేసేందుకు సన్నద్ధమవుతుండగా.. కరీనా కపూర్ మాత్రం తనకు హాలీవుడ్ అంటే ఆసక్తి లేదంటోంది.
బాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ఒకరైన కరీనా తన తాజా చిత్రం “కి అండ్ కా” సినిమా ప్రమోషన్ లో భాగంగా “హాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు?” అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “నాకు హాలీవుడ్ లో నటించడానికి కావాల్సిన శక్తి లేదు. నన్ను ఒదిలేయండి” అనేసింది.
కరీనా ఇచ్చిన సమాధానంతో షాక్ అయ్యారు బాలీవుడ్ మీడియా సభ్యులు!