ఆస్తి విషయంలో హీరోయిన్ పిల్లలను ఇబ్బంది పెడుతున్న సవతి తల్లి.. మేటర్ ఏంటంటే?

ఈ ఏడాది జూన్ 12న సంజయ్ కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో పోలో ఆడుతూ ఆయన ఆకస్మిక మరణం చెందారు. తర్వాత అతని కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. సంజయ్ కపూర్ కి ముగ్గురు భార్యలు అనే సంగతి తెలిసిందే. 1996 లో నందిత మహతానిని వివాహం చేసుకున్నారు. తర్వాత విభేదాల కారణంగా 2000 వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

Karisma Kapoor

తర్వాత 2003 లో కరిష్మా కపూర్ ని వివాహం చేసుకున్నారు సంజయ్ కపూర్. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తర్వాత కరిష్మాతో కూడా మనస్పర్థలు రావడంతో 2016 లో విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత 2017 లో ప్రియా సచ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు సంజయ్. ఈ జంటకు కూడా ఓ బాబుకి జన్మనిచ్చారు. అయితే సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆస్తి గొడవలు సంభవించాయి. 3వ భార్య ప్రియా సచ్‌దేవ్ ఆమె అనుచరులతో నకిలీ వీలునామా తయారు చేయించి కరిష్మా పిల్లలను ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంచుతున్నట్టు.. కరిష్మా లీగల్ ప్రొసీడింగ్స్ కి రెడీ అయ్యారు.

తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా ఇప్పించాలని సంజయ్ కపూర్, కరిష్మా పిల్లలు అయిన సమైరా, కియాన్..లు ఢిల్లీ హైకోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సమైరా, కియాన్..లు ఆ పిటిషన్లో “మా నాన్న గారు మాకు తెలియకుండా రాసిన వీలునామా ఒరిజినల్ కాదు.లీగల్ గా అది చెల్లదు. పూర్తిగా నకిలీ వీలునామా అది. అసలు వీలునామా మాకు చూపించడం లేదు. కనీసం దాని కాపీ కూడా మాకు ఇచ్చింది లేదు. మమ్మల్ని క్లాస్-1 చట్టపరమైన వారసులుగా గుర్తించి తండ్రి ఆస్తిలో చెరొక 5వ వంతు వాటా ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరుకుంటున్నట్టు” పేర్కొన్నారు.

జూన్ 19న సంజయ్ కపూర్ అంత్యక్రియలు అనంతరం ‘ఆస్తుల విషయంలో ఎటువంటి వీలునామా లేదని’ చెప్పిన ప్రియా… తర్వాత ‘ఆస్తులన్నీ ట్రస్ట్ కింద ఉన్నాయని’ చెప్పడం జరిగిందట. కానీ తర్వాత మార్చి 21 తేదీతో ఉన్న ఒక పత్రాన్ని సృష్టించి వీలునామాగా చూపించినట్టు కరిష్మా పిల్లలు తెలిపారు. సంజయ్ బ్రతికున్నప్పుడు ‘మీ భవిష్యత్తుకు ఎలాంటి లోటు ఉండదు, ఆర్థికంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని’ సమైరా, కియాన్ విన్నవించుకున్నారు.

‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus