Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

మొన్నీమధ్య వరకు ‘ది రాజా సాబ్‌’ సినిమా ఎప్పుడొస్తుంది, ఎప్పుడు పూర్తవుతుంది లాంటి ప్రశ్నలు వినిపించేవి. దానికి కారణం సినిమా టీమ్‌ నుండి ఎలాంటి సమాచారం రాకపోవడమే. మొన్నీమధ్య సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించడంతో ఇప్పుడు సినిమా ట్రైలర్‌ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది, ప్రమోషనల్‌ అప్‌డేట్స్‌ ఎప్పుడు వస్తాయి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో నిర్మాత మరో అప్‌డేట్ ఇచ్చారు. సినిమా తొలి పాట ఎప్పుడొస్తుంది అనేది కూడా చెప్పారు. అలాగే ట్రైలర్‌ సంగతి కూడా తేల్చేశారు.

Rajasaab Trailer

ప్రభాస్‌ హీరోగా మారుతి రూపొందిస్తున్న ‘ది రాజాసాబ్‌’ సినిమాను 2026 సంక్రాంతి బరిలో నిలిపారు నిర్మాత. ఈ మేరకు జనవరి 9న సినిమాను విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు సినిమా ట్రైలర్‌ సంగతి కూడా తేల్చేశారు. ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమాతోపాటు ‘ది రాజాసాబ్‌’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తామని తెలిపారు. అంటే అక్టోబరు రెండు నుండి ఈ సినిమా ట్రైలర్‌ను ఆ సినిమా థియేటర్‌లో చూడొచ్చు. అంటే ఆ రోజు కానీ, ఆ ముందు రోజు కానీ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ ఉండే అవకాశం ఉంది. అయితే సంక్రాంతి సినిమాకు ఇప్పటి నుండి ట్రైలర్‌ ఎందుకు అనేది వారికే తెలియాలి. ఇక ప్రభాస్‌ పుట్టిన రోజున అంటే అక్టోబరు 23న సినిమా తొలి పాటను విడుదల చేసే ఆలోచనలో టీమ్‌ ఉందట.

ఇవన్నీ చెప్పిన టీజీ విశ్వప్రసాద్‌.. తమ బ్యానర్‌లో రూపొందుతున్న మిగిలిన సినిమాల గురించి కూడా చెప్పారు. తమ బ్యానర్‌లో ప్రస్తుతం 12 సినిమాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ – రాశీ ఖన్నా – శ్రీనిధి శెట్టి – నీరజ జోన కాంబినేషన్‌ సినిమా ‘తెలుసు కదా’ అక్టోబరులో రిలీజ్‌ కానుందని తెలిపారు. ఆ తర్వాత రోషన్‌ – సందీప్‌ రాజ్‌ ‘మోగ్లీ’ వస్తుందట. ఇవిలా ఉండగా అడివి శేష్‌ – వామికా గబ్బి ‘జీ 2’, ఆనంది ‘గరివిడి లక్ష్మి’, లావణ్య త్రిపాఠి సినిమా, సునీల్‌ సినిమా కూడా ఉన్నాయి అని తెలిపారు. మొత్తంగా 2026, 2027లో మొత్తంగా బ్యానర్‌ నుండి 12 సినిమాలు వస్తాయని చెప్పారు.

 పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus