Karthik Dandu: విరూపాక్ష చూసి దిల్ రాజు ఫోన్ చేశారు: కార్తీక్

  • April 26, 2023 / 05:09 PM IST

కార్తీక్ దండు అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబడుతుంది.ఇలా ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ కార్తీక్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ సినిమా స్క్రిప్ట్ తాను 2017 వ సంవత్సరంలోనే పూర్తి చేసుకున్నానని తెలియజేశారు.కరోనాకు ముందు ఈ సినిమాని మా టీం మొత్తంతో చర్చించాము సినిమా కూడా ఓకే అయింది. అయితే అప్పుడే లాక్ డౌన్ పడటంతో ప్రపంచానికే అష్టదిగ్బంధనం వేసావా అంటూ హీరో, ప్రొడ్యూసర్లు నాతో సరదాగా అన్నారని కార్తీక్ వెల్లడించారు. ఇక ఈ సినిమా ప్రారంభించాలి అనుకున్న సమయంలో హీరోకి ప్రమాదం కావడం నన్ను అయోమయ పరిస్థితిలోకి నెట్టేసిందని తెలిపారు.

సాయి ధరమ్ తేజ్ కోలుకున్నారనే వార్త తెలిసిన తర్వాతే తన ప్రాణం కూడా తిరిగి వచ్చినట్టు అయిందని డైరెక్టర్ వెల్లడించారు. ఇలా కరోనా లాక్ డౌన్ సాయి ధరమ్ తేజ్ ప్రమాదం కారణంగా ఈ సినిమా చాలా ఆలస్యమైంది. అయితే ఈ సినిమా ఆలస్యంగా విడుదలైనప్పటికీ ఇంత మంచి సక్సెస్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ చాలా కష్టపడ్డారని డైరెక్టర్ వెల్లడించారు.

ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు తనకు (Karthik Dandu) ఫోన్ చేసి తనను మెచ్చుకుంటూ ఉంటే చాలా సంతోషం వేసిందని తెలిపారు. సుకుమార్ గారు కూడా ఫోన్ చేసి సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించడంతో తనకు చాలా ప్రౌడ్ గా ఉందని డైరెక్టర్ కార్తీక్ తెలిపారు. ఈ సినిమా చూస్తున్న తర్వాత తనకు చాలామంది ప్రొడ్యూసర్లు కూడా ఫోన్ చేశారని తెలిపారు. దిల్ రాజు గారు కూడా తనకు ఫోన్ చేసి సినిమా బాగుందని మెచ్చుకున్నారు. అయితే తాను ఏ నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకోలేదని ఈ సందర్భంగా కార్తీక్ వెల్లడించారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus