కార్తీ ‘కాష్మోరా’ ఫస్ట్‌ లుక్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌

యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం ‘కాష్మోరా’ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ”కాష్మోరా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కార్తీ డిఫరెంట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అన్ని విధాలుగా ఓ డిఫరెంట్‌ చిత్రంగా రూపొందుతున్న ‘కాష్మోరా’ తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.

హీరో కార్తీ మాట్లాడుతూ – ”ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కి అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నా గెటప్‌ ఎంత డిఫరెంట్‌గా వుందో సినిమా కూడా అంతే డిఫరెంట్‌గా వుంటుంది. నా కెరీర్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ వెరైటీ మూవీ. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది” అన్నారు.

కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌, కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌, ఫైట్స్‌: అన్‌బారివ్‌, ప్రోస్తెటిక్స్‌: రోషన్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె, నిర్మాతలు: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus