కరోనా సెకండ్ వేవ్ వల్ల ఓటీటీల హవా మళ్లీ మొదలైంది. చిన్న హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొత్త సినిమాల థియేట్రికల్ రిలీజ్ ఆగిపోవడం, కరోనా కేసులు పెరిగిపోవడం, ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తెలుగు రాష్ట్రాల్లోని వందల సంఖ్యలో థియేటర్లు మూతబడుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన సినిమాలు కొన్ని వారాల గ్యాప్ లోనే ఓటీటీలలో రిలీజవుతున్నాయి. కోలీవుడ్ హీరో కార్తీ, రష్మిక మందన్న జంటగా నటించిన సుల్తాన్ సినిమా ఈ నెల 2వ తేదీన విడుదలై యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.
వైల్డ్ డాగ్ కు పోటీగా విడుదలైన ఈ సినిమా వైల్డ్ డాగ్ కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. డిస్నీ + హాట్ స్టార్ సుల్తాన్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా ఈ నెల 30వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. రిలీజైన నాలుగు వారాలకే సుల్తాన్ ఓటీటీలో విడుదలవుతూ ఉండటం గమనార్హం. ఏప్రిల్ 30న తెలుగు వెర్షన్ తో పాటు తమిళ వెర్షన్ కూడా రిలీజవుతోంది.
సుల్తాన్ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు, ప్రకాష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. హాయిగా ఇళ్లలో కూర్చుని వీలు కుదిరినప్పుడు సినిమాలు చూసే అవకాశం ఉండటంతో ఓటీటీల వైపు నెటిజన్లు ఆకర్షితులవుతున్నారు. థియేటర్లలో యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకున్న సుల్తాన్ ఓటీటీలో హిట్ అనిపించుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!