Kartikeya: ఇంటర్వ్యూ : ‘బెదురులంక 2012’ మూవీ గురించి కార్తికేయ చెప్పిన ఆసక్తికర విషయాలు!

  • August 23, 2023 / 09:58 AM IST

ఆర్.ఎక్స్.100 హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కలయికలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. ‘లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. క్లాక్స్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘బెదురులంక 2012’ గురించి హీరో కార్తికేయ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. అవి మీ కోసం :

ప్ర) ‘బెదురులంక 2012’ ఎలా ఉండబోతుంది?

కార్తికేయ : ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అలాగే ఓ మంచి మెసేజ్ కూడా ఉంటుంది.

ప్ర) ‘బెదురులంక 2012’ ప్రయాణం ఎలా మొదలైంది?

కార్తికేయ : నా ‘ఆర్.ఎక్స్.100’ డైరెక్టర్ అజయ్ భూపతి .. దర్శకుడు క్లాక్స్ ని నాకు పరిచయం చేశాడు.ఇతను కూడా ఆర్జీవీ వద్ద పనిచేశాడు. కరోనా టైంలో నాకు క్లాక్స్ ఈ కథ చెప్పాడు. ఆ టైంలో కూడా ప్రపంచం ఏమైపోతుందా అనే భయం అందరిలో ఉంది కాబట్టి.. బాగా కనెక్ట్ అయ్యాను. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను.

ప్ర) మీ సినిమా టైటిల్స్ లో ఎక్కువగా నెంబర్లు కనిపిస్తాయి? కారణం ఏంటి?

కార్తికేయ : కొన్ని సినిమాలకి సెంటిమెంట్ గా ట్రై చేశాం.. కానీ ‘బెదురులంక’ విషయంలో కాదు. ఈ కథ 2012 టైంకి సంబంధించినది కాబట్టి.. ఆ టైటిల్ ను ఫిక్స్ చేశాం.

ప్ర) క్లాక్స్ మీకు చెప్పినట్టు ‘బెదురులంక 2012’ ని తీర్చిదిద్దాడా?

కార్తికేయ : ఈ కథ విన్నప్పుడు నాకు విజువల్ గా ఎలా ఉంటుంది అనే ఐడియా ఏమీ రాలేదు. కొన్ని కథలు విన్నప్పుడు మైండ్లో కొన్ని విజువల్స్ మెదులుతాయి. ‘బెదురులంక 2012’ కథ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే ఇందులో చాలా మంది నటీనటులు ఉంటారు. కామెడీ, మెసేజ్ వంటి అంశాలను టచ్ చేస్తూ కథ వెళ్తుంది. కానీ ఒక్కటైతే చెప్పగలను.. ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.

ప్ర) శివ శంకర వరప్రసాద్ అంటూ చిరంజీవి గారి రిఫరెన్స్ తీసుకున్నారు కదా?

కార్తికేయ: హ.. హ..! సినిమాలో నా క్యారెక్టర్ పేరు శివ. ఓ సీన్లో ‘శివ షో బిగిన్స్, శివ ఆట మొదలు’ అన్నట్లు చెప్పాలి. దానికి ఇంపాక్ట్ సరిపోవడం లేదు అని భావించి చిరంజీవి గారి రిఫరెన్స్ తీసుకున్నాం. సినిమాలో చాలా చోట్ల చిరంజీవి గారి రిఫరెన్స్ ఉంటుంది.

ప్ర) ఆర్.ఎక్స్.100 లో మీ పేరు శివ.. ఇందులో కూడా మీ పేరు శివ.. ! రెండు కూడా గోదావరి జిల్లాలో షూట్ చేసినవే. ఆ రకంగా మళ్ళీ బ్లాక్ బస్టర్ దక్కుతుంది అని భావిస్తున్నారా?

కార్తికేయ : అది పూర్తిగా కో ఇన్సిడెన్స్. సగం షూటింగ్ పూర్తయ్యే వరకు నాకే తెలీదు. క్లాక్స్ ను నేను తర్వాత అడిగితే అతను కూడా ఆశ్చర్యపోయాడు.

ప్ర) రాంచరణ్ తో ట్రైలర్ లాంచ్ చేయించారు? ఆయన ‘బెదురులంక’ గురించి ఏం చెప్పారు?

కార్తికేయ : చరణ్ గారికి ట్రైలర్ నచ్చింది. మ్యూజిక్ బాగుంది అని చెప్పారు.కొన్ని షాట్స్ మేకింగ్ గురించి, నేహా శెట్టితో నా లవ్ ట్రాక్ గురించి.. ప్రత్యేకంగా చెప్పారు. నా గురించి కూడా కొన్ని మంచి విషయాలు చెప్పారు. శివ శంకర్ వరప్రసాద్ డైలాగ్ గురించి అయితే చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నాం.

ప్ర) హీరోయిన్ నేహా శెట్టితో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది?

కార్తికేయ : సిటీ నుంచి ఊరికి వచ్చిన యువకుడిగా నా క్యారెక్టర్ ఉంటే… బెదురులంక ప్రపంచం మాత్రమే తెలిసిన ప్రెసిడెంట్ గారి అమ్మాయిగా నేహా శెట్టి కనిపిస్తుంది. ఈ రెండు పాత్రల మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. అలాంటి కెమిస్ట్రీ ఈ సినిమాలో మీరు చూడొచ్చు.

ప్ర) నిర్మాత బెన్నీ ముప్పానేని గురించి చెప్పండి..!

కార్తికేయ : కథ 2012 నేపథ్యంలో,ఓ పల్లెటూరిలో జరుగుతుంది. కాబట్టి నిర్మాతకి పెద్ద ఛాలెంజ్. ఎక్కువ మంది జనాలు కావాలి. ఖర్చు విషయంలో నిర్మాత బెన్నీ గారు అస్సలు రాజీ పడలేదు. ఈ సినిమాకి ఏం కావాలో అన్నీ ఇచ్చారు.

ప్ర) మణిశర్మ మ్యూజిక్ గురించి చెప్పండి?

కార్తికేయ : ఈ సినిమాకి సాంగ్స్ కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది ప్రాణం అని చెప్పాలి.ఇలాంటి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం అంటే మాటలు కాదు. మణిశర్మ గారు కాబట్టి.. అది బాగా వచ్చింది అని నమ్ముతున్నాను. పైగా ప్రమోషన్స్ కి కూడా వచ్చి సినిమాకి ఇంకా సాయపడ్డారు.

ప్ర) ‘బెదురులంక 2012’ తర్వాత మరో సినిమా ఎందుకు ప్రకటించలేదు?

కార్తికేయ : ఇక నుండి వరుస సినిమాలు చేయడం కంటే కూడా.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి చెప్పండి?

కార్తికేయ : నా (Kartikeya) నెక్స్ట్ మూవీ యూవీ క్రియేషన్స్ లో ఉంది. ప్రశాంత్ అనే కొత్త డైరెక్టర్ ఆ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ‘రన్ రాజా రన్’ వంటి హిట్ సినిమాలకి పనిచేశాడు. అది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus