స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీ వార్త వైరల్!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వెంటనే పిల్లల్ని కూడా కంటున్నారు. గతేడాది పెళ్లి చేసుకున్న అలియా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. రీసెంట్ గా వివాహం చేసుకున్న నయనతార సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లయింది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా తల్లి కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు.. కత్రినా కైఫ్. ఇప్పుడు ఈ బ్యూటీ గర్భవతి అనే విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కత్రినా కైఫ్. ఏడాది క్రితం రాజస్థాన్ లోని ఓ స్టార్ రిసార్ట్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది. అప్పటినుంచి వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. వదులైన దుస్తులను ధరించి కనిపించింది కత్రినా. దీనికి సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. కత్రినా వదులైన దుస్తులు ధరించినప్పటికీ.. ఆమె పొట్ట కాస్త ఎక్కువగా కనిపించడంతో..

ఆమె గర్భం దాల్చిందంటూ బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. తన గర్భాన్ని దాచిపెట్టడం కోసమే కత్రినా అలా వదులైన బట్టలను వేసుకుందని అంటున్నారు. అయితే ఈరోజుల్లో అలా గర్భాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అలియాభట్, కాజల్ లాంటి హీరోయిన్లు ఓపెన్ గానే ఈ విషయాన్ని బయటకు చెప్పి.. అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాబట్టి కత్రినా కైఫ్ తన గర్భాన్ని దాచి పెడుతుందని అనుకోవడానికి లేదు.

త్వరలోనే దీనిపై కత్రినా ప్రకటన చేస్తుందేమో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ ‘టైగర్3’ సినిమాలో కనిపించనుంది కత్రినా. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus