Katrina Kaif: ఆ స్టార్ హీరోతో హీరోయిన్ కత్రినా కైఫ్ డేటింగ్.. నిజమేనట..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఆమె వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’, బాలకృష్ణ సరసన ‘అల్లరి పిడుగు’ వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత మళ్ళీ ఈమె టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. బాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది.సినిమాలకు సంబంధించిన విషయాలతో మాత్రమే కాకుండా డేటింగ్ వార్తలతో కూడా ఈమె ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.

గతంలో ఈమె 10 ఏళ్ళ పాటు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.కానీ సల్మాన్ కు బ్రేకప్ చెప్పి రణబీర్ కపూర్ తో డేటింగ్ మొదలు పెట్టింది కత్రినా.అతనితో కూడా 4 ఏళ్ల పాటు కలిసి తిరిగింది.ఇక పెళ్లి మాత్రమే లేట్ అనుకునే టైం లో రణబీర్ కు కూడా బ్రేకప్ అయిపోయింది. అయితే ప్రస్తుతం కత్రినా.. మరో స్టార్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్లో ఉన్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.వీళ్ళు కలిసి ఉన్న ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో వీళ్ళ రొమాన్స్ హద్దులు దాటింది అనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వీళ్ళ డేటింగ్ వ్యవహారం పై క్లారిటీ ఇచ్చాడు.. ప్రముఖ నటుడు అలాగే విక్కీ కౌశల్ ఫ్రెండ్ అయిన హర్షవర్ధన్ కపూర్. ఇతను అనిల్ కపూర్ కొడుకు అన్న సంగతి తెలిసిందే.ఈయన ఇటీవల పాల్గొన్న ఓ టీవీ టాక్ షోలో విక్కీ, కత్రినా డేటింగ్ వ్యవహారాల పై క్లారిటీ ఇచ్చాడు. ‘వాళ్ళు డేటింగ్ లో ఉన్న మాట 100 శాతం నిజం.కానీ పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే నేను కచ్చితంగా చెప్పలేను’ అంటూ చెప్పుకొచ్చాడు హర్షవర్ధన్.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus