Katrina Kaif: కత్రినా ధరించిన ఈ స్వెటర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు వారు ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఖరీదైనది ఉండేలా కొనుగోలు చేస్తుంటారు. వాళ్లు ధరించే చెప్పుల నుంచి నివసించే ఇంటి వరకు ప్రతి ఒక్కటి ఖరీదైనది,ఎంతో విలాసవంతంగా సౌకర్యవంతంగా ఉండే వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు దుస్తులకు వాచ్ లకు చెప్పులకు పెట్టిన ధరలు చూస్తే మాత్రం దిమ్మ తిరిగి పోవాల్సిందే. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న

కత్రినా కైఫ్ తాజాగా మల్టీకలర్ స్వెటర్ ధరించి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే అందరి దృష్టి కత్రినా కైఫ్ స్వెటర్ పై పడింది. ఈ క్రమంలోనే ఆమె ధరించిన స్వెటర్ ధర ఎంత ఉంటుంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇలా కత్రినా కైఫ్ ధరించిన ఈ మల్టీకలర్ స్వెటర్ ధర అక్షరాల 445 డాలర్లు అని తెలుస్తుంది.

ఇక మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ స్వెటర్ ధర ఏకంగా 35 వేల రూపాయలు అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఈ స్వెటర్ కి 35 వేల రూపాయల ఖర్చు చేయాల్సినంత ప్రత్యేకత ఇందులో ఏముంది అంటూ పెద్ద ఎత్తున ఈ స్వెటర్ గురించి సెర్చ్ చేస్తున్నారు. కత్రినా ధరించిన ఈ స్వెటర్ ప్రత్యేకత ఏంటి అనే విషయానికి వస్తే మల్టీ కలర్, విభిన్నమైన అల్లికతో తయారైనటువంటి ఈ స్వెటర్ 100 శాతం పాలిస్టర్ తో తయారైంది.

ఇలా చూడగానే ఎంతో అట్రాక్టివ్ గా అనిపించే ఈ స్వెటర్ ను కత్రినా కైఫ్ భారీ ధరకు కొనుగోలు చేశారు. నిత్యం ట్రెండీ వేర్ లో ఎంతో క్లాసిక్ లుక్ లో కనిపించే కత్రినా కైఫ్ ఈ స్వెటర్ లో కూడా ఎంతో క్యూట్ లుక్స్ తో సందడి చేస్తోంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus