Prabhas, Katrina Kaif: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కత్రినాకైఫ్!

  • August 4, 2021 / 01:21 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకొని మరికొన్ని సినిమాలకు కూడా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల కోసం దర్శకులు రేంజ్ కు తగ్గట్లుగానే ఆలోచిస్తున్నారు. కథల విషయంలో మాత్రమే కాకుండా నటీనటుల ఎంపిక విషయంలో కూడా హై రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. ఇక సలార్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కూడా ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ సినిమా లో స్పెషల్ ఐటం సాంగ్ కత్రినా కైఫ్ ను సంప్రదించినట్లు సమాచారం. అందుకోసం కత్రినా కైఫ్ కు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు కూడా టాక్ వస్తోంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది త్వరలోనే ప్రమోషన్స్ కూడా డా స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్.

మరి సినిమా అభిమానుల అంచనాలను ఈ మేరకు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రభాస్ ప్లాన్ సెట్ చేసుకుంటున్నారు. ఆ సినిమాకి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus