Kavya Thapar: ప్రొడ్యూసర్‌ ఫ్రెండ్స్‌ గురించే చెప్పిందిగా

  • June 6, 2021 / 10:34 PM IST

సినిమా హీరోయిన్‌ అన్నాక నటన ఎంత అవసరమో, నచ్చిన హీరోలు ఎవరు అని అడిగితే అన్ని రకాలు లెక్కలేసుకొని పేర్లు చెప్పాలి. ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోయిన్లకు ఈ విషయం బాగా అర్థమైపోయినట్లుంది. అందుకనే ఇంటర్వ్యూల్లో ‘మీ అభిమాన హీరో ఎవరు?’ అనే ప్రశ్నకు పక్కా ప్లానింగ్‌తో చెబుతున్నారేమో అనిపిస్తోంది. కావాలంటే ‘ఏక్‌ మినీ కథ’ హీరోయిన్‌ కావ్య థాపర్‌ సమాధానం వింటే మీకే అర్థమవుతుంది. ‘ఏక్‌ మినీ కథ’ సినిమాను యూవీ క్రియేషన్స్‌ వారి మరో ప్రొడక్షన్‌ హౌస్‌ యూవీ కాన్సెప్ట్స్‌ నిర్మించిన విషయం తెలిసిందే.

ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. ఈ క్రమంలో సినిమా కథానాయిక కావ్య థాపర్‌ ఇటీవల మీడియాతో మాట్లాడింది. అందులో మీకు నచ్చిన హీరో ఎవరు అనడిగితే… నాని, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ నటనని ఎంతో ఇష్టం. వాళ్లతో కలిసి నటించాలనుంది అని చెప్పింది. ఈ మూడు పేర్లు చూస్తే మీకేమనిపిస్తోంది. యూవీ క్రియేషన్స్‌ ప్రభాస్‌ బ్యానర్‌ అనే విషయం తెలిసిందే. ప్రభాస్‌కు రామ్‌చరణ్‌ మంచి మిత్రుడు.

యూవీ క్రియేషన్స్‌ కార్యకలాపాలు చూస్తున్న టీమ్కు నాని బాగా దగ్గర. ఈ లెక్కలన్నీ వేసుకొనే కావ్య థాపర్‌ ఈ మాట చెప్పిందా అనేది ఆమెకే తెలియాలి. మొన్నీ మధ్య ‘ఉప్పెన ’భామ కృతి శెట్టి కూడా ఇలానే రామ్‌చరణ్ జపం చేసింది. దీంతోనే ఇలాంటి డౌట్స్‌ వస్తున్నాయి. అయితే నిజంగానే అభిమానిస్తున్నారేమో అనే డౌట్‌ కూడా ఉందండోయ్‌.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus