జనసేన పార్టీలో చేరిన నిర్మాత కాయగూరల లక్ష్మీపతి

కే ఎల్ పి మూవీస్ సంస్థ అధినేత IQ మూవీతో నిర్మాతగా మరియు బిజినెస్ మాన్ అయినటువంటి కాయగూరల లక్ష్మీపతి గారు నేడు జనసేన పార్టీలో చేరారు. ఈయన తండ్రి గారు కీ.శే. శ్రీ కె. నారాయణస్వామి గారు టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో ఈయన కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరారు. గతంలో ఈయన ఆర్టిఏ బోర్డు మెంబర్ గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గా అనంతపురం పట్టణ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు సేవ చేసిన వ్యక్తి. అనంతపురం లో ప్రభుత్వ స్థలము నందు శాశ్వత ఆర్ టి ఓ కార్యాలయమును నిర్మించుటకు కృషిచేసి నిర్మాణం పూర్తి చేశారు.

టెలికం ఎస్ టి డి, ఐ ఎస్ డి కమిటీ మెంబర్ గా పని చేసిన కాలంలో పార్టీ కార్యకర్తలకు ఎస్.టి.డి బూతులు కేటాయించి బ్యాంకు రుణాలు ఇప్పించారు. కె ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు దుప్పట్లో చేతి కర్రలు పంచి నీళ్ల ట్యాంకు నిర్మాణం చేయించారు. అదేవిధంగా అఖిలభారత కాపు సమాఖ్య నందు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కాపు, బలిజల సంఘాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి. నేడు ఈయనకు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతపురం అర్బన్ నియోజకవర్గం పార్టీ గెలుపు కోసం ప్రజాసేవ కోసం కృషి చేయాలని సూచించడం అయినది.

ఈ సందర్భంగా కాయగూరలు లక్ష్మీపతి గారు మాట్లాడుతూ : పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో పాల్గొనడం జరిగింది. సినిమా అంటే ఇష్టంతో IQ అనే సినిమాతో రంగ ప్రవేశం చేశాను. ఇంకా రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమాలంటే అంత ఇష్టం. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ లభిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.

అదేవిధంగా బిజినెస్ రంగంలో నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. సినిమాలు నిర్మిస్తూనే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో జనసేన పార్టీలో జిల్లాలో ఎక్కడ పొత్తు మీద స్థానం ఇచ్చిన నా వంతు కృషి చేస్తూ పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus