చైతూ కోసం రూల్ మార్చిన కీరవాణి!

ఎనిమిదేళ్లుగా తాను ప్రేమిస్తున్న సమంతను పెద్దల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకొని ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తునే కెరీర్ ప్లానింగ్ లో బిజీ అయిపోయాడు నాగచైతన్య. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న “సవ్యసాచి” సినిమా కోసం చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. ఇప్పటివరకూ పెళ్లయ్యాక హిట్ లు కొట్టిన హీరోలు చాలా తక్కువ. ఎన్టీయార్, అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోస్ పెళ్ళాయాక ఫ్లాప్స్ చవిచూడాల్సి వచ్చింది. ఈ సెంటిమెంట్ ను కూడా దృష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ “సవ్యసాచి”తో సూపర్ హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నాడు.

చందు మొండేటి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కథానాయికగా “ప్రేమమ్”లో ఆల్రెడీ చైతూతో జోడీగా నటించిన అనుపమ పరమేశ్వరన్ కనిపించనుండగా ఈ చిత్రానికి కీరవాణి సంగీత సారధ్యం వహించనున్నారని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలకు మాత్రమే సంగీతం అందిస్తానంటూ ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసిన కీరవాణి.. కథ నచ్చడంతోపాటు నాగచైతన్య అంటే తనకు విశేషమైన అభిమానం ఉండడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించారట. సమంత లైఫ్ లోకి రావడంతో ఆమె లక్కీ చార్మ్ చైతూ బాబుకి కూడా కాస్త అచ్చోస్తే బాగుండు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెల నుండు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus