నయన్ కాదు కీర్తి సురేషే.. ఆ సీక్వెల్ లో నటిస్తుందట..!

  • June 26, 2020 / 08:00 AM IST

‘మహానటి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కీర్తి సురేష్. ఆ చిత్రం తరువాత ఈమెకు వరుసగా తమిళ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ నయన తార మాత్రమే అలా చేస్తూ వచ్చింది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. నయన తార ప్రధాన పాత్రలో తెరకెక్కి.. సూపర్ హిట్ గా నిలిచిన ఓ చిత్రం సీక్వెల్ ను ఇప్పుడు కీర్తి సురేష్ తో తియ్యబోతున్నారట.

ఇంతకీ నయన తార నటించిన ఏ సూపర్ హిట్ చిత్రానికి కీర్తిని తీసుకున్నారు అనేగా మీ డౌట్? 2017 లో దర్శకుడు గోపీ నయినార్.. నయన్ తో ‘అరం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో కూడా రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి దర్శకుడు గోపీ నయినార్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. అయితే ఈ సీక్వెల్ ను నయన్ తో కాకుండా సమంత తో తెరకెక్కించాలి అని ప్రయత్నిస్తున్నాడట.

నయన్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడం వల్లే సమంతను తీసుకోవాలి అని మొదట అనుకున్నాడట. అయితే కారణాలేంటో తెలీదు కానీ.. ఇప్పుడు కీర్తి సురేష్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ‘కీర్తి.. నయన్ రేంజ్లో పెర్ఫార్మ్ చెయ్యలేదు’ అనే కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. గతంలో సావిత్రి పాత్రకు కూడా కీర్తి సెట్ అవ్వదు అనే కామెంట్స్ వినిపించాయి. కానీ కీర్తి సురేష్ మాత్రం మంచిగా పెర్ఫార్మ్ చేసి అందరి నోళ్ళు మూయించింది. ఈసారి కూడా అలాంటి సీనే రిపీట్ అవుతుందేమో చూడాలి..!

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus