హీరోలకు ఆ విషయం చెబితే ఫీల్ అవుతారేమోననిపిస్తుంది

ఒకప్పుడు బాలనటిగా నటించి, కాలక్రమంలో అదే హీరోలతో హీరోయిన్లుగా నటించి నాయికలు అనేక మంది ఉన్నారు. వీరిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శ్రీదేవి గురించి. ఎన్టీఆర్‌, అక్కినేని వంటి స్టార్స్‌తో మనవరాలిగా, కూతురిగా నటించిన ఆమె ఆ తర్వాత వారితో హీరోయిన్‌గా గ్లామర్‌ పాత్రలు చేసి మెప్పించింది. పరిశ్రమలో ఇది సహజమే. తాజాగా మహానటిగా గుర్తింపబడి, మంచి నటిగా ప్రశంసలు అందుకుంటున్న కీర్తి సురేష్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. ఒకప్పుడు బాలనటిగా నటించిన కీర్తి, అదే హీరోలతో నాయికగా నటించే ఛాన్స్‌ కొట్టేస్తోంది. హీరోలతో కలిసి నటిస్తున్నపుడు తను అదే హీరోతో బాలనటిగా చేసిన విషయం గురించి మాత్రం ప్రస్తావించను అంటోంది కీర్తి.

ఈ విషయం చెబితే హీరోల వయసు గురించి మాట్లాడినట్టుగా వారు భావించే ప్రమాదం ఉందని అందుకే చెప్పనని స్పష్టం చేసింది. చిన్నతనం నుండి హీరోలను చూస్తూ పెరిగాను, ఇప్పుడు వారితో కలిసి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇదంతా అదృష్టంగానే భావిస్తాను అని చెబుతోంది. ఈతరం నాయికల్లో కీర్తి సురేష్‌ను అభినయానికి అవకాశం ఉన్న పాత్రలే లభిస్తున్నాయి. ఆమెను మరో సౌందర్య అని టాలీవుడ్‌ అంటోంది. కీర్తిలో గ్లామర్‌ కంటే నటినే చూస్తున్నారు. గ్లామర్‌ పాత్ర చేస్తే డబ్బు వస్తుంది కాబోలు కానీ పేరు మాత్రం రాదు భగవంతుని దయవల్ల నాకు డబ్బు కోసమే సినిమాలు చేసే అవసరం లేదు అని కీర్తి సురేష్‌ పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus