ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైన కీర్తి సురేష్ మొదటి సినిమా..!

కీర్తి సురేష్‌, న‌వీన్ కృష్ణ జంట‌గా రూపొందిన చిత్రం `జానకిరామ్`. బేబీ శ్రేయారెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఓబులేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రాంప్ర‌సాద్ ర‌గుతు ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌టం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత త‌మ‌టం కుమార్ రెడ్డి మాట్లాడుతూ….“ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా చిత్రంలోని పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప‌నులు పూర్త‌య్యాయి. సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ మంజూరు చేశారు. త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హ్యుమ‌న్ ట్రాఫికింగ్ నేప‌థ్యంలో మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన చిత్రమిది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ గారి త‌న‌యుడు న‌వీన్ కృష్ణ‌ హీరోగా న‌టించాడు. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. అచ్చు రాజ‌మ‌ణి గారు ఏడు అద్భుత‌మైన పాట‌లు కంపోజ్ చేశారు. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారు కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించారు. కీర్తి సురేష్ , న‌వీన్ కృష్ణ మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కీర్తి సురేష్ అందం, అభిన‌యంతో పాటు న‌వీన్ కృష్ణ ప‌ర్పార్మెన్స్ ఆక‌ట్టుకుంటాయి. ఇక కృష్ణ వంశీ గారి లాంటి పెద్ద ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన రాంప్ర‌సాద్ రగుతు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించాడు.ఇందులో స‌ప్త‌గిరి, పోసాని, రాహుల్ దేవ్ , ర‌ఘు కారుమంచి ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రో ఇంపార్టెంట్ రోల్ లో చాందిని న‌టించింది. త్వ‌ర‌లో సినిమా విడుదల తేదీ ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus