సన్నబడాలి కానీ.. ఇలా పేషెంట్ లా అయిపోతే ఎలా

  • June 15, 2019 / 06:54 PM IST

న‌టి కీర్తి సురేష్‌ను అభిమానులు గుర్తు పట్టలేకపోతున్నారు. ఇన్నాళ్లూ కాస్త బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు నాజూకుగా తయారయింది. సినిమాలో పాత్ర కోసం జిమ్‌లో కసరత్తులు చేసి మరీ బరువు తగ్గింది. ఇటీవల ఆమె జిమ్‌లో దిగిన ఫొటో కూడా వైరల్‌ అయ్యింది. కాగా ఆమె ప్రస్తుతం స్పెయిన్‌లో ఉంది. అక్కడ దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసింది.

ఓ ఫొటోలో బ్లూ కలర్‌ స్కర్ట్‌, కళ్లద్దాలతో దర్శనమించింది. అయితే అందులో ఆమె గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఈ ఫొటోకు అభిమానుల నుంచి తెగ రియాక్షన్స్‌ వచ్చాయి. “మీరు చాలా సన్నగా అయ్యారు. గుర్తు పట్టలేకపోయా, మీ క్యూట్‌ బుగ్గలు ఇకలేనట్టేనా.. చాలా అందంగా ఉన్నారు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే విధంగా కీర్తి సురేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో స్పెయిన్‌ రైలులో ప్రయాణిస్తుండగా దిగిన ఫొటోను పంచుకుంది. ఇందులోనూ ఆమె గుర్తు పట్టలేని విధంగా కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus