మరోసారి మహానటి అనిపించుకున్న కీర్తి సురేష్

  • August 11, 2018 / 11:59 AM IST

కీర్తి సురేష్ సినీ కెరీర్ ని మహానటి సినిమాకి ముందు, తర్వాత అనే విధంగా చెప్పుకోవచ్చు. మహానటికి ముందు సాధారణ హీరోయిన్ గా ఉన్న ఈమె.. ఈ చిత్రం తర్వాత ఎనలేని క్రేజ్ ని సంపాదించుకుంది. సావిత్రిలా నటించి అందరి మనసులో స్థానం సంపాదించుకుంది. సావిత్రి పాత్రతో కొంతకాలం కొనసాగారు కాబట్టి ఆమె ప్రభావం కీర్తిపై పడింది. సావిత్రిలా కట్టు బొట్టు మాత్రమే కాదు ఆమెకున్న అలవాటును కూడా సొంతం చేసుకుంది. సావిత్రికి తన సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత యూనిట్ సభ్యులకు గిఫ్ట్ లు ఇవ్వడం అలవాటు. ఆ అలవాటును కీర్తి సురేష్ కొనసాగిస్తోంది.

గతంలో మహానటి సినిమాకు పనిచేసిన యూనిట్‌ సభ్యులకు బంగారు నాణేలను గిఫ్ట్‌ గా ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఆ పని చేసి మంచి మనసున్న నటిగా నిరూపించుకుంది. ప్రస్తుతం ఈమె విశాల్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పందెంకోడి – 2’ చిత్రంలోహీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ చివరి రోజున యూనిట్ సభ్యులందరికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చింది.  కీర్తి ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో యూనిట్‌ సభ్యులు ఆనందపడ్డారు. వెండితెరపైనే సావిత్రిలా నటించడమే కాదు.. నిజజీవితంలోను సావిత్రిలా మారిపోయిన కీర్తి సురేష్ కి అందరూ కృతజ్ఞతలు చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus