ప్రతీవారంలానే ఈ వారం కూడా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో సింబా (Simbaa) అనే సినిమా కూడా ఉంది. స్టార్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించడం, అనసూయ (Anasuya Bhardhwaj) ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషించడం.. ఇంకా చాలా మంది స్టార్స్ కూడా ఉండటం వల్ల కొంతమంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. వారిని ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ : అక్ష(అనసూయ) ఒక టీచర్. తన స్కూల్లో బెస్ట్ టీచర్ గా అవార్డులు అందుకుంటూ.. మరోవైపు సంఘంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ఈమె .. తన భర్త, పాపతో కలిసి ఒక కాలనీలో చాలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. అయితే ఒకసారి స్కూటర్ పై వెళ్తూ ఒక సిగ్నల్ వద్ద ఆగిన ఈమెకి లోకి (కేశవ్ దీపిక్ ) ను చూసి ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కారులో వెళ్తున్న అతన్ని వెంబడించి దారుణంగా కొట్టి చంపుతుంది.
అలాగే మరో హత్య కూడా చేసి అనురాగ్ (వశిష్ట సింహా) (Vasishta N. Simha) అనే పోలీస్ ఆఫీసర్ కి దొరికిపోతుంది. ఆమెతో కలిసి జర్నలిస్టు ఫాజిల్ (శ్రీధర్ మాగంటి (Srinath Maganti ) అలాగే ఒక డాక్టర్ (అనీష్ కురువెళ్ల (Anish Kuruvilla) కూడా ఈ హత్యల్లో పాల్గొంటారు. వాళ్ళని కూడా అనురాగ్ అరెస్ట్ చేస్తాడు. అసలు ఒకరితో మరొకరికి సంబంధం లేని ఈ ముగ్గురూ కలిసి ఎందుకు హత్యలు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : అనసూయ మంచి నటిగా ప్రూవ్ అయ్యి చాలా కాలం అయ్యింది. కాకపోతే ఈ మధ్య విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ఆమె సింబా ఎంపిక చేసుకున్నట్లు అర్దం చేసుకోవచ్చు. ఇందులో ఒక అపరిచితురాలు టైపు పాత్ర పోషించింది అనసూయ. ఆమె వరకు బాగా చేసింది. ఆ తర్వాత శ్రీధర్ మాగంటి, అనీష్ కురవెళ్ల ..ల పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. వశిష్ట్ సింహా ఒక సెమీ హీరో టైపు పాత్ర పోషించించాడు.
తన వరకు హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇక జగపతిబాబు (Jagapathi Babu) రీసెంట్ టైమ్స్ లో డిఫరెంట్ రోల్ చేశాడు అని చెప్పాలి.ఈ కథలో చాలా కీలకమైన పాత్ర అది. ఇక కబీర్ పాత్ర ఓకే అనిపించినా.. దివి(Divya Vadthya) , కస్తూరి.. ల పాత్రలు గెస్ట్ రోల్స్ ని తలపించాయి. మిగిలిన వాళ్ళ పాత్రలు పెద్దగా గుర్తుండవు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ‘సింబా’ (Simbaa) కి కథ అందించింది నిర్మాతల్లో ఒకరైన సంపత్ నంది. అయితే అతని సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన మురళీ మనోహర్ డైరెక్ట్ చేయడం జరిగింది. కొత్త దర్శకుడు అయినప్పటికీ.. స్క్రిప్ట్ ను బాగానే డిజైన్ చేయించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే నడిపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచే విధంగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ గాడి తప్పింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న సస్పెన్స్ ను సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు కంటిన్యూ చేయలేకపోయాడు.
గౌతమి (Gautami Tadimalla) పాత్ర ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో మిగిలిన కథపై ఒక అవగాహన వచ్చేస్తుంది. అక్కడి నుండీ ప్రతి సీన్ ను ముందుగానే గెస్ చేసే విధంగా ఉంటుంది. అక్కడ గ్రిప్పింగ్ నెరేషన్ ఉంటే సినిమా గట్టెక్కేసేది. అక్కడ అది లోపించడం వల్ల ఇది సాదా సీదా సినిమాగా మిగిలిపోయినట్టు అవుతుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. సంగీతం పరంగా చూసుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత వరకు ఓకే, పాటలు ఎక్కువగా లేవు. ఉన్న చిన్న చిన్న పాటలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూడలేదు.
విశ్లేషణ: నేచర్.. కార్పొరేట్ సంస్థల వల్ల ఎలా నాశనం అవుతుంది అనే మంచి పాయింట్ తో రూపొందిన సినిమా. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ నిరాశపరిచింది.
రేటింగ్ : 2/5