కీర్తి సురేష్ నెక్స్ట్ చేయబోయే.. తెలుగు మూవీ అదే..?

‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది కీర్తి సురేష్. చేసిన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో పాటు నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఇక నేచురల్ స్టార్ నాని తో ‘నేను లోకల్’ చిత్రంతో కూడా సూపర్ హిట్ అందుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత కోలీవుడ్ లో కూడా విజయ్, శివ కార్తికేయన్, విక్రమ్, ధనుష్, సూర్య , విశాల్ వంటి అగ్ర హీరోలతో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

గత సంవత్సరం విడుదలైన ‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయన్ అయిపోయింది కీర్తి సురేష్. అయితే ‘మహానటి’ చిత్రం తరువాత తెలుగులో ఒక్క చిత్రం కూడా చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. టాలీవుడ్ కంటే కోలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కీర్తి సురేష్. టాలీవుడ్ లో అంత క్రేజ్ వచ్చిన తరువాత ఏ హీరోయినయినా… కనీసం అరడజను సినిమాలను లైన్లో పెట్టేసుకుంటుంది. కాని కీర్తి సురేష్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అస్సలు కంగారు పడకుండా… ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది.

ఇక ‘మహానటి’ చిత్రం తర్వాత కీర్తి సురేష్ కు చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ కీర్తి సురేష్ మాత్రం ఇందుకు ఒప్పుకోకపోవడం గమనార్హం. అయితే తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో నటించబోతుందంట. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ కథను అని తెలుస్తుంది. ఇక ఈ కొత్త డైరెక్టర్ వినిపించిన కథ కీర్తి సురేష్ కు బాగా నచ్చడంతో వెంటనే డేట్లు కూడా ఇచ్చేసిందట.’ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్లో కళ్యాణ్ రామ్ తో ‘118’ వంటి చిత్రాన్ని నిర్మిస్తున్న మహేష్ కోనేరు… ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus