మహానటి క్రేజ్ ను క్యాష్ చేసుకొంటున్నారు!

  • May 30, 2018 / 08:14 AM IST

క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం అనే పద్ధతిని సినిమా ఇండస్ట్రీలో ఫాలో అయినట్లుగా మరెక్కడా వాడరేమో. ఒక హీరోయిన్ సినిమా హిట్ అయ్యి.. ఆమెకు కాస్త క్రేజ్ క్రియేట్ అయ్యిందంటే చాలు.. ఆమె నటించిన మునుపటి సినిమాలను డబ్బింగ్ రూపంలో విడుదల చేసి క్యాష్ చేసుకొంటారు. ఇప్పుడు కీర్తి సురేష్ విషయంలో ఈ ఫార్మాట్ నే ఫాలో అవుతున్నారు మన తెలుగు డిజిటల్ కంటెంట్ హోల్డర్స్. తమిళంలో కీర్తి సురేష్ కథానాయికగా తెరకెక్కిన “తొడరీ” అనే చిత్రాన్ని తెలుగులో “రైల్” అనే పేరుతో డబ్బింగ్ చేశారు. డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రంలో ధనుష్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా చూసిన తర్వాతే నాగఅశ్విన్ “మహానటి”లో సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ ను ఎంపిక చేశాడని పలుమార్లు చెప్పిన విషయం అందరికీ విదితమే.

ఇప్పుడు “రైల్” చిత్రం డిజిటల్ రైట్స్ ఎవరో కొత్త ప్రొడ్యూసర్స్ సొంతం చేసుకొన్నారు. ఆ చిత్రాన్ని మహానటి కీర్తి సురేష్ నటించిన సినిమాగా పబ్లిసిటీ చేస్తూ యూట్యూబ్ లో పెట్టారు. థియేటర్ లో సినిమా ఆడుతున్నప్పుడు కనీసం చూడని ప్రేక్షకులందరూ కీర్తి హీరోయిన్ అనడంతో యూట్యూబ్ లో ఆ సినిమాను అదే పనిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా యూట్యూబ్ లో ఇండియా వైడ్ ట్రెండింగ్ లిస్ట్ లో ఉండడంతోపాటు.. అప్లోడ్ చేసిన ఒక్కరోజులోనే 4 లక్షల వ్యూస్ సొంతం చేసుకొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus