మహేష్ బాబు నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల అన్వేషణ
- March 2, 2017 / 11:01 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మే నెలనుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. భరత్ అను నేను అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ చిత్రంలో ప్రిన్స్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా మొదట కీర్తి సురేష్ ని అనుకున్నారు. నేను.. శైలజ చిత్రంతో అందరి మనసులు దోచుకున్న ఈ బ్యూటీ నేను లోకల్ మూవీతో మరో మెట్టు పైకి ఎదిగింది.
నటనలో శెభాష్ అనిపించుకున్నప్పటికీ కొంతమంది ఫిలిం మేకర్స్ కీర్తి బరువు పెరగడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కమర్షియల్ హీరోయిన్ అంత లావు ఉంటే ఎలా? అంటూ కామెంట్ చేస్తున్నారు. కొరటాల కూడా అదే అభిప్రాయాన్ని ప్రిన్స్ ముందు వెల్లడించగా, ఆయన కీర్తిని పక్కన పెట్టమని చెప్పినట్లు సమాచారం. దీంతో డైరక్టర్ కొత్త బ్యూటీ వేటలో పడ్డారు. ఇదివరకు ప్రిన్స్ తో నటించని హీరోయిన్ ని ఈ మూవీలో ఎంపిక చేయాలనీ వెతుకుతున్నారు. ఆ అదృష్టం ఏ తారకు వరిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














