కీర్తి సురేష్ నటనకు మెచ్చి అవకాశమిచ్చిన రాజమౌళి

బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి మ్యాసివ్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, రామారావులు తొలిసారి కలిసి నటించనున్న ఈమూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా జరుగుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మించనున్న ఈ ప్రాజక్ట్ కి #RRR అనే పేరు పెట్టారు. అంతకు మించి ఈ సినిమా గురించి ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. 1980 ఒలింపిక్స్ నేపథ్యంలో కథ సాగుతుందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. హీరోయిన్స్ విషయంలో ఇప్పటికే అనేక పేర్లు బయటికి వచ్చాయి. రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ పేర్లు వినిపించాయి.

కానీ అదంతా ప్రచారమే అని రాజమౌళి బృందం తెలిపింది. తాజాగా ఒక హీరోయిన్ ని సెలక్ట్ చేసినట్టు సమాచారం. మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రజల మనసు దోచుకున్న కీర్తి సురేష్ ని జక్కన్న ఖరారు చేసినట్లు టాక్. మహానటి సినిమా చూసిన తర్వాత రాజమౌళి ట్విట్టర్ వేదికపై ప్రసంశలు గుప్పించారు. అలాగే మహానటి చిత్ర యూనిట్ ని అల్లు అరవింద్ సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి కూడా వెళ్లారు. ఈ రెండు సంఘటనలు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే #RRR టీమ్ మాత్రం కీర్తి సురేష్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు ప్రస్తుతం కీర్తి సురేష్ ఏ తెలుగు సినిమాలకు సైన్ చేయని బిజీగా తమిళ సినిమాలు చేస్తోంది. మరి #RRR మూవీలో కీర్తి సురేష్ ఉంటుందా? ఉండదా? అనే సస్పన్స్  కొన్ని రోజులపాటు కొనసాగుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus