గ్లామర్ పాత్రలకు కీర్తి సురేష్ ఎప్పుడూ దూరమే. కెరీర్ బిగినింగ్ నుండి ఆమె ఆ తరహా పాత్రలు చేసింది లేదు. అలాంటిది ఒక్కసారిగా కీర్తి సురేష్ బికినీ ధరించనుంది అనే వార్తలు పుట్టుకొచ్చాయి. కనీసం అందాల విందు చేసే పొట్టిబట్టలు కూడా వేయని కీర్తి ఏకంగా బికినీ వేయడం ఏమిటని ఆమె అభిమానులు కూడా ఒకింత షాక్ కి గురయ్యారు. ఈ రూమర్స్ కి బీజం పడడానికి కారణం ఆమె బరువు తగ్గడమే. మహానటి సినిమాలో సావిత్రి పాత్ర కోసం ఆమె కొంచెం బరువు పెరిగారు.
కానీ హీరోయిన్స్ కి ఉండాల్సిన మొదటి లక్షణం స్లిమ్ గా ఉండడం. ఎంత టాలెంట్ ఉన్నా, శరీరం షేప్ కోల్పోతే అవకాశాలు అస్సలు తలుపు తట్టవు. అందుకే తారలు కడుపు మాడ్చుకొని మరీ, గంటల కొలది జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తారు. అందుకే కీర్తి కూడా బాగా బరువు తగ్గిపోయింది. ఎంత తగ్గిందంటే అసలు గుర్తు పట్టలేనంతగా అని చెప్పొచ్చు. అప్పట్లో కీర్తి సురేష్ ని చూసిన అందరూ, చక్కనమ్మ బొద్దుగా ఉన్నప్పుడే బాగుంది అని చెప్పుకున్నారు.
కారణంగా ఏదైనా కీర్తి బరువు తగ్గడానికి కారణం బికినీ ధరించడానికే అని మీడియా కోడై కూసింది. తెలుగులో ఆమె మిస్ ఇండియా అనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఆ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు ఆమె బికినీలో దర్శనమివ్వనున్నారు అని కథనాలు రావడం జరిగింది. ఈ కథనాలపై కీర్తి సురేష్ స్పందించింది. బరువు ఆరోగ్యం కోసం తగ్గానని, మీరు అనుకుంటున్నట్లు బికినీ వేసే ఆలోచన లేదని వార్తలను కొట్టి పారేసింది. దీనితో కీర్తి సురేష్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు