Keerthy Suresh, Jr NTR: ఎన్టీఆర్30 మూవీ గురించి అలాంటి ప్రచారమా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్30 సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతూ ఉండటంతో ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలలో ఎక్కువగా ఫేక్ న్యూస్ ఉండగా కొంతమంది మాత్రం ఆ వార్తలను నిజమేనని నమ్ముతున్నారు. తాజాగా యువసుధ ఆర్ట్స్ నుంచి త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలుకానుందని చెబుతూ ఒక ట్వీట్ వైరల్ అయింది. అయితే యువసుధ ఆర్ట్స్ ట్విట్టర్ లో మాత్రం అలాంటి పోస్ట్ లేకపోవడంతో వైరల్ అయిన ట్వీట్ ఫేక్ ట్వీట్ అని క్లారిటీ వచ్చింది.

మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీని కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజముందా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కీర్తి సురేష్ కు సరైన సక్సెస్ లేదు. సర్కారు వారి పాట హిట్టైనా ఈ సినిమా సక్సెస్ లో కీర్తి సురేష్ పాత్ర తక్కువేననే సంగతి తెలిసిందే. తారక్ కొర్తటాల శివ కాంబో మూవీలో తమకు ఛాన్స్ రావాలని పలువురు హీరోయిన్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

తారక కొరటాల శివ కాంబో మూవీ పాన్ ఇండియా సినిమాగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. అయితే కీర్తి సురేష్ కు ఈ సినిమా ఆఫర్ రాకపోయినా ఆమెకు ఆఫర్ వచ్చిందని ఆఫర్ ను కీర్తి రిజెక్ట్ చేసిందని కొంతమంది ప్రచారం చేస్తుండటం గమనార్హం.

వైరల్ అవుతున్న ఫేక్ వార్తలపై చిత్రయూనిట్ లేదా కీర్తి సురేష్ స్పందిస్తే బాగుంటుందని మరి కొందరు అనుకుంటున్నారు. మరోవైపు సినిమాసినిమాకు తారక్ రేంజ్ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో తారక్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చెప్పలేం కానీ ఈ కాంబినేషన్ లో సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుందని బోగట్టా.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus