కీర్తి సురేష్ తన ప్రేమను ఇలా వ్యక్తం చేసింది !!

  • June 23, 2017 / 09:22 AM IST

హీరో, హీరోయిన్లను సామాన్యులు అభిమానించడం సాధారణం. వారి పైన విపరీతమైన ప్రేమను కురిపించడం మామూలే. కానీ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె మరో హీరోపై ప్రేమను వ్యక్తపరచడం విశేషంగా అనిపిస్తుంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా కీర్తి సురేష్. తమిళం, మలయాళంలో కీర్తి అనేక హిట్ సినిమాలు చేసింది. తెలుగులో కూడా నేను శైలజ, నేను లోకల్ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మహానటి సావిత్రిగా నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనూ కథానాయికగా చేస్తుంది.

ఈమెకు తమిళ నటుడు విజయ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. హీరోయిన్ గా మారిన తర్వాత కూడా ఆ విషయాన్ని అందరి ముందు చెప్పుకుంది. మరో మారు తన అభిమానాన్ని చాటుకుంది. అతడి పుట్టినరోజును పురస్కరించుకొని కొన్ని గంటల పాటు కష్టపడి విజయ్ కోసం పెయిటింగ్ సిద్ధం చేసింది. ఆ పెయింటింగ్ ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ ఆర్ట్ వర్క్ చూసిన అందరూ కీర్తి సురేష్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus