మరీ.. చిరుకి మనుమరాలులా ఉంటుందేమో..!

మన టాలీవుడ్ సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్ల సమస్య వచ్చి పడింది. సీనియర్ హీరోయిన్లను తీసుకుంటే ఆ సినిమాకి క్రేజ్ వచ్చే అవకాశం ఉండదు. ఇక కుర్ర హీరోయిన్లను తీసుకుంటే… వీరిపక్కన మరీ చిన్న పిల్లల్లా ఉంటున్నారని కామెంట్సూ వస్తాయి. ఈ రెండు విషయాల్ని ఆచి.. తూచి పరిశీలించాలి. సీనియర్ హీరోలతో సినిమాలు తీయాలని రెడీ అవుతున్న దర్శకనిర్మాతలకు ఇదో పెద్ద తలనొప్పి గా మారింది. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవికి సైతం ఈ సమస్య తప్పలేదు. ‘స్టాలిన్’ చిత్రంలో త్రిష, ‘ఖైదీ నెంబర్ 150’ లో కాజల్.. చిరు పక్కన చిన్న పిల్లల్లా కనిపించారనే కామెంట్స్ వినిపించాయి. ‘సైరా’ చిత్రంలో నయనతార లాంటి సీనియర్ మరియు క్రేజీ హీరోయిన్ కాబట్టి పెద్దగా సమస్య లేదు.

కానీ డైరెక్టర్ కొరటాల శివ మాత్రం ఈ విషయంలో తెగ తంటాలు పడుతున్నాడట. ‘సైరా’ చిత్రం పూర్తవ్వగానే మెగాస్టార్ చిత్రాంజీవి.. కొరటాల శివ డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. రాంచరణ్, ‘మాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట అనుష్క ను హీరోయిన్ గా అనుకున్నారట. అయితే చిరంజీవి కంటే పొడుగ్గా ఉండటం.. అలాగే కాస్త ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిలా మన స్వీటీ కనిపిస్తుందని భావించి ఆవిడని తప్పించారట. ఇక అటుతరువాత నయన తార ను అనుకున్న.. ఆవిడ డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని భావించి ఆవిడను కూడా తప్పించారట. అంతే కాదు తమన్నా, శృతీ హాసన్ ను అనుకుంటే వాళ్ళు మరీ చిన్నపిల్లల్లా ఉంటారేమో అని డైలమాలో పడ్డాడంట కొరటాల. ఇదిలా ఉండగా ఇప్పుడు కీర్తి సురేష్ ను కూడా సంప్రదిస్తున్నాడట. ‘మహానటి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదగిన కీర్తి అయితే ఈ చిత్రానికి మరింత క్రేజ్ వస్తుందని కొరటాల భావించి ఆమెను సంప్రదిస్తున్నాడట. అయితే చిరు పక్కన కీర్తి సురేష్.. మరీ మనుమరాలు లా ఉంటుందేమో అని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus