కీర్తి సురేష్ ఆ సినిమా కోసం అంత కష్టపడిందా..!

కొంతమంది హీరోలకి అలాగే కొంతమంది హీరోయిన్ ల కి ఏ సినిమా ప్లస్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మహేష్ కి ‘పోకిరి’, రాంచరణ్ కు ‘రంగస్థలం’ సినిమాలు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాలకి ముందు ఈ హీరోలకి హిట్లు లేవా..? అంటే.. ఉన్నాయి..! కానీ వీళ్ళే ఆ సినిమాలకి మేజర్ ప్లస్. అలాగే హీరోయిన్ల విషయానికి వస్తే … ‘మహానటి’ చిత్రానికి ముందు కీర్తి సురేష్ అంటే అందరికీ తెలిసి ఉండదు. కానీ ‘మహానటి’ తరువాత ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఏకంగా నేషనల్ అవార్డు కొట్టేసింది.

ఇదిలా ఉంటే.. ఆమె ఓ సినిమా కోసం ఏకంగా..50 లుక్ టెస్ట్స్ చేయించుకుందట. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఆమె ‘మిస్ ఇండియా’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో డిఫరెంట్ టైం పీరియడ్స్ కు సంబంధించి డిఫరెంట్ లుక్స్ లో కీర్తి సురేష్ కనిపించాల్సి ఉందట. అందుకే ఒక్కో లుక్ కు 10 టెస్ట్ లు వరకూ చేసారట. కీర్తి ఎంతో ఓపికగా 50 లుక్ టెస్ట్స్ లో పాల్గొనడం జరిగిందని దర్శకుడు నరేంద్ర నాద్ చెప్పుకొచ్చాడు. ఏమైనా.. కీర్తి డెడికేషన్ కి మెచ్చుకోవాల్సిందే..!

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus