ఆ ఫ్లాప్ సినిమాతో ముద్దుగుమ్మ “మహానటి” అయిపోయింది.!

  • April 30, 2018 / 07:15 AM IST

సినిమా రిజల్ట్ మీద హీరోహీరోయిన్లు మరియు దర్శకుల కెరీర్లు ఆధారపడి ఉంటాయన్న విషయం తెలిసిందే. సినిమా హిట్ అయితే ఆఫర్లు ఎలా అయితే క్యూ కడతాయో, ఫ్లాప్ అయితే అదే విధంగా వచ్చిన ఆఫర్లు కూడా దూరమవుతాయి. అయితే.. విచిత్రంగా తమిళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కి మాత్రం ఒక సూపర్ ఫ్లాప్ చిత్రం ఒక సూపర్ హిట్ ఛాన్స్ తెచ్చిపెట్టింది. ఫ్లాప్ సినిమా హిట్ ఆఫర్ తీసుకురావడమేంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? కంగారుపడకుండా కథ మొత్తం చదవండి.

కెరీర్ తొలినాళ్లలో కీర్తిసురేష్ “తొడారి” అనే చిత్రంలో కథానాయికగా నటించింది. ఒక హాలీవుడ్ చిత్రం ఆధారంగా ధనుష్ హీరోగా ప్రభు సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఒక హీరోయిన్ అసిస్టెంట్. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన చూసే.. “మహానటి” చిత్రంలో కథానాయికగా సావిత్రిగా నటించేందుకు సెలక్ట్ చేసుకున్నాడట నాగఅశ్విన్. ఈ విషయాన్ని స్వయంగా కీర్తిసురేష్ “మహానటి” తమిళ ప్రమోషన్స్ లో చెప్పడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus