సోషల్ మీడియాలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, బ్రేకప్ వార్తలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి.. ఈమధ్య కాలంలో కీర్తి సురేష్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. కీర్తి త్వరలోనే అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతుందనే వార్త మీడియాతో పాటు నెట్టింట కూడా వైరల్ అయింది.. ప్రస్తుతం కీర్తి చేతిలో ఆరు సినిమాలున్నాయి.. చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్న ‘భోళా శంకర్’ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని యూనిట్‌ని కోరిందని.. మిగతా ప్రాజెక్టుల దర్శక నిర్మాతలను కూడా వీలైనంత త్వరగా తన పార్ట్ షూట్ పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తోందని..
అలాగే కొత్త సినిమాలేవీ కూడా కమిట్ కావడం లేదని తెలిసింది.. దీనికి కారణం కీర్తి (Keerthy Suresh) పెళ్లి పీటలు ఎక్కబోతుండడమేనని సమాచారం.. తన చిన్ననాటి స్నేహితుడిని మ్యారేజ్ చేసుకోబోతోందట.. ప్రస్తుతం తన వయసు 30 సంవత్సరాలు కాబట్టి.. పెళ్లి చేసుకుని, ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అని కీర్తి సురేష్ ప్లాన్ చేసుకుంటుందని అంటున్నారు.. త్వరలోనే ఆమె ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటించనుందనేది ఆ వార్తల సారాంశం..
ఇదిలా ఉంటే.. ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడబోతుందంటూ మరో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.. దీంతో కీర్తి మధర్, అలనాటి కథానాయిక మేనక స్పందించారు.. ‘కీర్తి పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.. తను ఎవరినీ ప్రేమించినా మాకు చెప్తుంది.. మేం కూడా అలాంటిది ఏమైనా ఉంటే బహిరంగంగా మీడియాకి చెప్తాం.. అయితే మా అమ్మాయి ఎవర్నీ లవ్ చేయడం లేదు.. తన మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం..
తన గురించి పుకార్లు పుట్టిస్తున్నారంటే.. ఆమె నటిగా ఎదుగుతుందని అర్థం’ అని చెప్పుకొచ్చారు మేనక.. ‘నేను లోకల్’ తర్వాత నానితో కలిసి నటించిన ‘దసరా’ మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. అలాగే కీర్తి చేసిన ‘వెన్నెల’ క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఈ రోల్ నటిగా కీర్తి సురేష్ కెరీర్‌కి ప్లస్ అవుతుందని చెప్తున్నారు ఫిలిం వర్గాల వారు..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?