మరో అసాధారణమైన రికార్డుని సొంతం చేసుకున్న ‘కె.జి.ఎఫ్2’ టీజర్..!

ఎటువంటి అంచనాలు లేకుండా 2018వ సంవత్సరంలో విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కూడా రాబోతుండడంతో పేక్షకులంతా ఈ సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఈ సినిమా గురించే ప్రేక్షకులు ఎక్సయిట్మెంట్ తో ఉన్నారని చెప్పాలి.

దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా యష్ పుట్టినరోజు నాడు విడుదలైన ‘కె.జి.ఎఫ్2’ టీజర్ ను చెప్పుకోవచ్చు. మొదటి భాగానికి మించి ఇందులో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే ఎలివేషన్స్ ఉంటాయని స్పష్టంచేశారు చిత్ర యూనిట్ సభ్యులు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేది.కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి మళ్ళీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయని చర్చ నడుస్తుంది కానీ దీని పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా కె.జి.ఎఫ్2 టీజర్ తాజాగా ఓ అసాధారణమైన రికార్డుని సొంతం చేసుకుంది.

అదేంటంటే.. ‘కె.జి.ఎఫ్2’ టీజర్ కి యూట్యూబ్లో 200 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.అంతేకాదు 8.4 మిలియన్ లైక్స్ అలాగే 1 మిలియన్ కామెంట్స్ కూడా నమోదవ్వడం విశేషం. అన్ని భాషల్లోనూ ఒకే టీజర్ ను విడుదల చేసారు కాబట్టి.. ఇలాంటి హిస్టరీ క్రియేట్ చేయగలిగింది ‘కె.జి.ఎఫ్2’ టీజర్.ఈ చిత్రం తెచ్చిపెట్టిన క్రేజ్ వల్ల ప్రశాంత్ నీల్ కూడా టాలీవుడ్లో బిజీ డైరెక్టర్ అయిపోయాడు.


పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus