Devara: దేవర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న కే జి ఎఫ్ నటుడు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRRసినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది.పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా కీలక పాత్రలలో నటించడం కోసం ఇతర భాషలలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి నటీనటులను కొరటాల రంగంలోకి దింపబోతున్నారు.

ఈ సినిమాలో (Devara) హీరోయిన్ గా దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. అదేవిధంగా పిల్లల పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం విలన్ గ్యాంగ్ లో కీలకపాత్రలో నటించడం కోసం కొరటాల కే జి ఎఫ్ నటుడిని రంగంలోకి దింపారని తెలుస్తుంది. కే జి ఎఫ్ సినిమాలో నటుడిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు తారక్ పొన్నప్పని తీసుకున్నారు.

రీసెంట్ గా షూటింగ్ కి అటెండ్ అయ్యాడు. త్వరలో జరగబోయే కొత్త షెడ్యూల్ లోనూ అతడు పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది.ఇలా ఇతర భాషల నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సెలబ్రిటీలు అందరికి దేవర సినిమాలో అవకాశాలు కల్పిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వ ప్రతిభను నమ్మి ఎన్టీఆర్ తనకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు.

దీంతో తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కొరటాల శివ కూడా భారీగానే కష్టపడుతున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus