Yash: కేజీఎఫ్ హీరోకు జోడీగా నటించే హీరోయిన్ ఆమేనా?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్2 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుని అందరినీ అశ్చర్యపరిచింది. కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. అయితే కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలతో వచ్చిన క్రేజ్ తనకు మరింత ప్లస్ అయ్యే విధంగా యశ్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు.

కేజీఎఫ్ హీరో తర్వాత మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. మఫ్టీ ఫేం నార్తన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. యశ్ ఇప్పటికే ఈ సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టారని బోగట్టా. పీరియాడికల్ యాక్షన్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాతో యశ్ ఖాతాలో మరో సక్సెస్ గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

యశ్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. యశ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. యశ్ సినిమాలకు భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు. యశ్ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీస్థాయిలో డిమాండ్ నెలకొంది.

యశ్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ సినిమాల ద్వారా తెలుగు రాష్ట్రాలలో కూడా యశ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus